శనివారం 2 అక్టోబర్ 2010
అయోధ్య తీర్పు
హై కోర్టు ఇచ్చిన తీర్పు ఇరు మతాలకి సంబందించి ఒక రాజీ అవకాశం కల్పించింది. కేంద్రం చొరవ తీసుకుని మందిరము,మసీదు,రెండిటిని నిర్మించి మత సామరస్యానికి కృషి చెయ్యాలి. భారత ప్రజలు చూపించిన పరిణితి దేశ భవిష్యత్తును సాక్షాత్కరిస్తున్నది . దేశ ప్రగతికి ఇక మతం అడ్డు కాదని చాటి చెపుదాం.
మంగళవారం 7 సెప్టెంబర్ 2010
ఏమి చేయాలి?
ప్రభుత్వమే గనులను జాతీయం చేసుకొని ముడి ఖనిజాన్ని దేశీయ అవసరాలకు వాడుకుని మిగిలినది ఎగుమతి చేస్తే ఆ సొమ్ము మొత్తం ప్రభుత్వానికే అంటే ప్రజలకే దక్కుతాది.ఈ సొమ్ముతో మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టవచ్చు.
మీకు తెలుసా?
ఇండియా లో పదకొండు లోహ ఖనిజాలు యాభై రెండు లోహేతర ఖనిజాలు ఇరవైరెండు చిన్న ఖనిజాలు ఉన్నాయ్.మొత్తం గనుల్లో తొంభై శాతం పదకొండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ గనుల విధానము వలన ఎగుమతిదరులకే అధిక మొత్తం దక్కుతున్నది. రాయల్టీరూపం లో ప్రభుత్వానికి దక్కేది చాలా తక్కువ. ఉదాహరణకు ఇనుప ఖనిజం నవంబర్ రెండువేల తొమ్మిది లో టన్నుకి నూట ఆరు డాలర్లు అంటే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదురూపాయలు. ఎగుమతిదారు కి అన్ని ఖర్చులూ కలిపి టన్నుకి వెయ్యి రూపాయలు కంటే ఎక్కువ అవటం లేదు.సుమారుగా ఇయర్ కి కోటి టన్నుల ఇనుప ఖనిజం ఎగుమతి అవుతున్నది. దీని నుండి లెక్క వేస్తె ఎగుమతిదరుకి సుమ్మరుగా మూడువేల ఎనిమిదివందల తొంభై ఐదు కోట్లు ,ప్రభుత్వానికి రాయల్టీ రూపం లో కేవలం పద్నాలుగు కోట్లు మాత్రమే వస్తున్నాయి.
మంగళవారం 29 జూన్ 2010
abhipraayam
ఒక మనిషి గురించి అంచనా వేసే టపుడు అతని బాహ్యాన్ని కాకుండా అతని అంతరంగాన్ని చూడండి.
ఒక పని గురించి చర్చించినపుడు ఆ పని యొక్క కష్టాన్ని,ఫలితాన్ని చూడండి.
ఆదివారం 6 జూన్ 2010
రైల్వే తత్కాల్ స్క్హీం
రైల్వే లో తత్కాల్ ఏ కారణం తో ప్రవేశ పెట్టారో అది నేరవేరుతున్నదా? లేదు. మామూలు రిజర్వేషన్ కి దీనికి పెద్ద తేడా లేదు.రైల్వే కి ఆదాయం పెంచే మార్గము తప్ప ప్రయాణికునికి ఉపయోగపడే విధముగా లేదు. ఇందులో కూడా ఏజెంట్ హవా నడుస్తున్నది. ప్రయాణికుల రద్దీ ద్రుష్టి లో పెట్టుకుని మరిన్ని ట్రైన్స్ ప్రవేశ పెట్టాలి.
సోమవారం 14 జూలై 2008
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)